HYD: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం నిరసిస్తూ నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పిలుపులో భాగంగా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగా బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ, ఆమెతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీకాంత్‌ను పోలీసులు ఈరోజు ఉదయం ముందస్తు అరెస్ట్ చేశారు.