MNCL: ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టి పనులు కొనసాగిస్తుంది అన్నారు.