ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో అమాయకులను మోసగించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఓపీడీఆర్ సభ్యులమని నమ్మిస్తూ నిందితులు బల్లి శ్రీనివాస్, కోపెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.