JN: పాఠశాలలను అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి కలిగించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ తెలిపారు. పాలకుర్తి ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతులను సందర్శించి వారు మాట్లాడారు. ఆట పాటలతో విద్య బోధన జరగాలన్నారు. ప్రీ ప్రైమరీ క్లాస్ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు.