HNK: ఈనెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని జాగృతి జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. డాక్టర్ బోడ అనిల్ కుమార్, పృద్వి ఉన్నారు.