HYD: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సరఫరాలో అంతరాయం కలగడంతో అనేక చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. గంటల తరబడి వేచి చూడటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలి వాహనదారులు కోరుతున్నారు.