NZB: ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కన్యకా పరమేశ్వరి ఆలయంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో అన్నీ సాధించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. నగరవాసులంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.