»Corona Commotion In Mahabubabad 15 Students Have Covid
Corona Positive : మహబూబాబాద్‌లో కరోన కలకలం…15 మంది విద్యార్థులకు కోవిడ్
మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District)లో గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా (Corona) సోకింది. పాఠశాలలో జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్టులు (covid tests) నిర్వహించారు. వీరిలో 15 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ గా తేలింది. విద్యార్థులు ప్రస్తుతం ఐసోలేషన్ (Isolation) లో చికిత్స పొందుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District)లో గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా (Corona) సోకింది. పాఠశాలలో జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్టులు (covid tests) నిర్వహించారు. వీరిలో 15 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ గా తేలింది. విద్యార్థులు ప్రస్తుతం ఐసోలేషన్ (Isolation) లో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40 మందికి కరోనా పరీక్షలు చేయగా..వారిలో ఇద్దరికి పాజిటీవ్(Positive)గా నిర్ధారణ అయింది. ఈ ఇద్దరు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో కొవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరికి ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో…ఎంజీఎంలో కొత్తగా వార్డు ఏర్పాటు ఏర్పాటు చేశారు.
కరోనా మొదటి, రెండోదశలో ఉపయోగించిన పడకలతోపాటు, 144 వెంటిలేటర్లను అందుబాలులో ఉంచారు. ఎంజిఎం హాస్పిటల్ (MGM Hospital) ఆసుపత్రిలోని మొత్తం 1200 పడకలను కరోనా చికిత్సకు ఉపయోగించుకునేలా ఆక్సిజన్ అనుసంధానించారు. ఎంజీఎంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేదని సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ నిమిషానికి వెయ్యి లీటర్లను ఉత్పత్తి చేయగల రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు(Oxygen generation plants) ఉన్నాయన్నారు. ఒక ప్లాంటు ప్రస్తుతం పనిచేయకపోవడంతో మరమ్మతుల కోసం కంపెనీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో 23 వేల లీటర్ల నిల్వ సామర్థ్యం గల రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు సైతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కేఎంసీ(KMC)లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రస్తుతం 13 వేల లీటర్ల నిల్వగల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ఉందన్నారు.
కోవిడ్ టెస్టు కిట్స్ , అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈనెల 10న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కోవిడ్ మాక్ డ్రిల్ (Covid Mock Drill) నిర్వహించబోతున్నామన్నారు. ఎంజిఎం హాస్పిటల్ లో కోవిడ్ కోసం కోసం ఉన్న ఫెసిలీటిస్, బెడ్స్, మందులు, సిబ్బంది ఇతర వివరాలు ప్రత్యేక పోర్ట్ ద్వారా అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్లలో కొన్నిటికి టెక్నికల్ సమస్యలు ఉన్నాయని..ఆక్సిజన్ ఫ్లో మీటర్స్, చిన్న చిన్న ఎక్యూమెంట్ బల్క్ ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. కోవిడ్ స్పెషల్ వార్డులు (Covid Special Wards) అందుబాటులో ఉంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా సిద్దంగా ఉన్నామన్నారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక, వైద్యాధికారులతో ఫోనులో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం చేయాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందవద్దని వారు సూచించారు.