MGM Staff:ఆరోగ్యం ఇంపార్టెంట్.. అందరికీ మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తామని ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతుంటారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. అవును.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి (MGM Hospital) సిబ్బంది మానవత్వం మరిచారు. ఓ రోగికి స్ట్రెచర్ ఇవ్వాలని కోరితే నిరాకరించారు. దీంతో ఆ వృద్దుడు తన భార్యను భుజంపై మోసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మికి (laxmi) ఆరోగ్యం బాగోలేదు. నెల కింద ఎంజీఎం ఆస్పత్రికి రాగా.. అక్కడి వైద్యులు (MGM doctors) అరిపాదం తీసివేశారు. నెల తర్వాత రావాలని కోరితే.. శుక్రవారం భర్త చెకప్ కోసం తీసుకొచ్చాడు. కూలీ నాలీ చేసే వారు.. కష్టపడి వస్తే.. ఈ రోజు పెద్ద సారు లేరని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రేపు రావాలని చెప్పి.. వెళ్లిపోయారు.
వచ్చేటప్పుడు కష్టపడి వచ్చిన వృద్దుడు.. వెళ్లేప్పుడు స్ట్రెచర్ ( Stretcher) ఇవ్వాలని కోరాడు. అడిగిన ఫలితం లేదు.. ఇక చేసేదేమీ లేక.. భుజాలపైకి ఎక్కించుకొని బయటకు తీసుకొచ్చాడు. అలా తీసుకెళ్తుండగా అక్కడున్న మిగతా వారు, రోగుల బంధువులు ఆశ్చర్యపోయారు. ఆ వృద్దుడి వయస్సు, ఇబ్బందిని చూసి అయినా ఆస్పత్రి సిబ్బంది స్పందిస్తే బాగుండేదని అంటున్నారు.
కొందరు వీడియో (video) తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ ట్రోల్ అవుతుంది. స్ట్రెచర్ ఇవ్వని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో మరోసారి ఇలాంటి ఘటన జరగబోదని అంటున్నారు. నిజమే లేదంటే.. మరో చోట అయినా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది.