»How Many Houses Have You Built In Four Years Chandrababu Selfie Challenge To Jagan
Chandrababu: నాలుగేళ్లలో మీరు కట్టిన ఇళ్లు ఎన్ని?..జగన్ కు చంద్రబాబు సెల్ఫీ సవాల్
ఏపీ(ap)లో గత నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని జగన్(jagan) అంటూ...చంద్రబాబు(Chandrababu naidu) ఆయనకు సెల్ఫీ సవాల్(selfie challenge) చేశారు. మీరు చెప్పిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. నెల్లూరులో టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగిన క్రమంలో ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేసి డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ (TDP) అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ys jagan mohan reddy) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి తమ టీడీపీ ప్రభుత్వం నిర్మించిన పేదల ఇళ్ల ముందు దిగిన సెల్ఫీలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాలుగేళ్ల పాలనలో నిర్మించిన ఇళ్ల సెల్ఫీలను పోస్ట్ చేయాలని జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఏపీ వ్యాప్తంగా పట్టణ మౌళికసదుపాయల కల్పన సంస్థ టిడ్కో ఆధ్వర్యంలో 94 పురపాలక సంఘాల్లో నివాస సముదాయాలని నిర్మించింది. ఇళ్లు లేని పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వీటిని నిర్మించింది.
నెల్లూరులోని టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) నిర్మించిన ఇళ్ల దగ్గర చంద్రబాబు నాయుడు(Chandrababu) సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్లని పేర్కొన్నారు. రాష్ట్రంలో(AP) నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు అని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్నో చెప్పాలని బాబు..జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
ఆయన తనయుడు, టీడీపీ(TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతో సెల్ఫీలు దిగిన నేపథ్యంలో నాయుడు సెల్ఫీ ఛాలెంజ్(selfie challenge)కు తెరలేచింది. అనంతపురం జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రాజెక్టులతో పాటు పలు సెల్ఫీలను లోకేష్ సైతం ఈ పోస్టును రీట్వీట్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెలకొల్పిన కియా కార్ల ప్లాంట్ ముందు మార్చి 30న లోకేష్ సెల్ఫీ దిగారు. ఇలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావాలని కలలో కూడా ఊహించలేదని జగన్‌తో లోకేష్ అన్నారు. అప్పుడు కుమారుడు జగన్(jagan)కు సెల్ఫీ చాలెంజ్ విసరగా..ఇప్పుడు తండ్రి సవాల్ చేయడం విశేషం.
చూడు… @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!