Constable Raj kumar Stabbed Wife Then Push the top of the house
Constable Raj kumar:కానిస్టేబుల్ కుంచపు రాజ్ కుమార్లో (Raj kumar) సైకో బయటకు వచ్చాడు. కట్టుకున్న భార్య గొంతుకోసి.. ఆపై బిల్డింగ్ పైనుంచి తోసివేశాడు. కుమారుడు అడ్డువచ్చిన పట్టించుకోలే.. వినలేదు. జరిగిన ఘటన గురించి అతని కుమారుడు పోలీసులకు వివరించాడు.
హైకోర్టు 4వ గేట్ వద్ద కానిస్టేబుల్‌గా పనిచేసే రాజ్ కుమార్ (Raj kumar) వనస్థలిపురం గౌతమినగర్‌లో ఉంటున్నాడు. ఇతనికి భార్య శోభ (shobha), కుమారుడు ఉన్నాడు. భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఇతనికి వివాహేతర సంబంధం కూడా ఉందట. ఇంకేముంది ఇదే విషయమే నిన్న పీక్ లెవల్లో గొడవ జరగగా.. కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ (Raj kumar) .. తన భార్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
గత ఏడాదిగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని వారి కుమారుడు (son) తెలిపాడు. తన తల్లిపై దాడి చేయబోతుండగా.. అడ్డువచ్చిన తనపై దాడి చేశాడని బాలుడు చెప్పాడు. తన తండ్రిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. పోలీసుస్టేషన్ ముందు శోభ బంధువులు ఆందోళనకు దిగారు. దంపతుల మధ్య గొడవలు జరిగాయని.. పోలీసు అధికారి నచ్చజేపితే పంపించామని చెప్పారు. ఇప్పుడు కూతురిని హత్య చేశాడని వారు వాపోయారు.