Congress ఆరు వాగ్ధానాలు ఇవే..? అధికారంలోకి వచ్చేనా..?
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు వాగ్ధానాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. విజయభేరి సభ వేదికపై ఆ వాగ్ధానాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటిస్తారు.
Congress: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ (Congress) అనుకుంటోంది. ఆ మేరకు వ్యుహరచన చేసి ముందడుగు వేసింది. తుక్కుగూడలో ఈ రోజు కాంగ్రెస్ విజయభేరి సభ జరగనుంది. వేదికపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరు వాగ్ధానాలు చేస్తారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు వాటిని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది.
మహాలక్ష్మీ పథకం: ఇందులో భాగంగా రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తారు. సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యికి పైగా ఉన్న సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో రూ.500 వరకు ఉండేది. ఎన్డీఏ అధికారం చేపట్టి.. అడ్డగోలుగు రేట్లు పెంచింది. మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది.
రైతు భరోసా:ఓకేసారి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెబుతోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాజీవ్ యువ వికాసం: తమ పార్టీ అధికారం చేపట్టిన తొలి ఏడాది2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతామని చెబుతోంది. దీంతో నిరుద్యోగ యువతను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసింది.
అంబేద్కర్ అభయభస్తం:ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోన్న దళితబంధుకు రూ.2 లక్షలు ఎక్కువ కలిపి అందజేయనుంది.
చేయూత:ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తారు. దీంతో ఇళ్లను పకడ్బందీగా కట్టుకునే వీలు ఉంటుంది.
మహిళా సాధికారత:దారిద్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తారు.