మహారాష్ట్ర (Maharashtra) నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్నిసీఎం కేసీఆర్ (CMKCR) ప్రారంభించారు.అనంతరం పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎంను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం నాగ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు. మహారాష్ట్రలోని విదర్భ సహా రాష్ట్రంలోనే బీఆర్ఎస్ (BRS) పార్టీ మొదటి కార్యాలయం ఇదే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తన ఉనికిని విస్తరించుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
అక్కడి కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి మాస్ బేస్ పెంచేలా దిశా నిర్దేశం చేయనున్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ఈ నినాదంతో రైతులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది.పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు(MP Keshav Rao), సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల, మహారాష్టకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.