KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 17 నుంచి LLB కోర్సులో 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రమైన ఆర్ట్స్ కళాశాలను VC యూ. ఉమేష్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.