VKB: ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 25 కేజీల గంజాయిని వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం పల్నాడు ఎక్స్ప్రెస్లో తనిఖీలు చేపట్టగా ఈ గంజాయి లభ్యమైంది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ ఎక్సైజ్ అధికారి రాఘవీణ తెలిపారు.