HNK: హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో మావోయిస్టు బాలకృష్ణ ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి వెంకటేశ్వర్లు పోస్టల్ ఉద్యోగి కావడంతో హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. బాలకృష్ణకు ముగ్గురు సోదరులు ఉన్నారు. లక్ష్మీనారాయణ, సుధాకర్ వ్యాపారంలో రాణిస్తుండగా ప్రభాకర్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. వీరి సొంతిల్లు మడికొండలో ఇప్పటికీ ఉంది.