NLG: భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శప్రాయుడని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించిన మహనీయుడని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నకిరేకల్‌లోని వారి విగ్రహానికి ఎమ్మెల్యే గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు.