GNTR: మహాత్మా గాంధీ జయంతిని ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీవో రవిబాబు మాట్లాడుతూ శాంతి, సహనం, సత్యం, అహింస అనే విలువలతోనే గాంధీ జీవితం సాగింది అని తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.