CTR: మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ శాంతియుత మార్గంలో ముందుకు సాగాలని కడ పీడీ వికాస్ మర్మత్ పేర్కొన్నారు. కుప్పం కడ కార్యాలయంలో మహాత్మా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి జోహార్లు ఘటించారు. భారతదేశ స్వాతంత్య్ర సమూపార్జనకు శాంతియుత మార్గంలో ముందుకు సాగిన గాంధీ ప్రతి ఒక్కరికి ఆదర్శం అని పీడీ పేర్కొన్నారు.