W.G: దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు