VSP: విశాఖపట్నంలో వర్షాల కారణంగా నేలకొరిగిన చెట్లను, రహదారులపై ఏర్పడిన అడ్డంకులను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని నగర మేయర్ శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈదురు గాలుల వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ రమణమూర్తికి ఆయన సూచించారు.