కృష్ణా: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ఉప ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ఇలాంటి జాతి నేతల త్యాగనిరతి మనందరికీ స్ఫూర్తి దాయకం కావాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 156,మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల 121వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం పరితపించిన మహనీయుల చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు.