KRNL: హొళగుంద మండలం వన్నూరు క్యాంపులో అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ నేత రవీంద్రబాబు పార్థివదేహాన్ని ఎంపీ బస్తిపాటి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.