KDP: ప్రొద్దుటూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని గురువారం అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు, ఆర్యవైశ్య సభ సభ్యులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చరిత్ర, ఆలయ విశిష్టత, దసరా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను ఆయనకు వారు వివరించారు.