మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని విజయదశమి, దసరా పండుగ సందర్భంగా గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో క్యూలైన్లు కిక్కిరీసిపోయాయి. దర్శనం అనంతరం ప్రసాదం కోసం లైన్లో భక్తులు బారులు తీరారు.