VSP: గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముల త్యాగమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని కలెక్టర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహాత్ముల అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.