HYD నుంచి వివిధ జిల్లాలకు దసరా పండుగ వేళ ఆర్టీసీ సేవలు అందించింది. నేటి నుంచి తిరుగు ప్రయాణ సేవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ వరకు స్పెషల్ బస్సుల్లో 50% అధిక ఛార్జీల వసూలు కొనసాగుతుందని ఉప్పల్ ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. రేపటి నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పకడ్బందీగా చర్యలు అమలు చేస్తున్నారు.