అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. విండీస్‌తో పోలిస్తే 41 రన్స్ వెనుకంజలో ఉంది. క్రీజులో రాహుల్ (53), గిల్ (18) ఉన్నారు. జైస్వాల్ (36), సాయి సుదర్శన్ (7) పెవిలియన్ చేరారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌటైంది.