W. G: జగన్మాత కనకదుర్గమ్మ దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా సిరిసంపదలతో తులతూగాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం జరిగిన దసరా శమీ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. దసరా పండుగ చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ అన్నారు.