SKLM: దూసి రైల్వే స్టేషన్ సమీపంలో మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు పెద్ద వృక్షంగా అవతరించిందని స్థానికులు తెలిపారు. 1942వ సంవత్సరం క్విట్ ఇండియా ప్రచారంలో భాగంగా గాంధీ దూసి రైల్వే స్టేషన్లో 15 నిమిషాల పాటు ఆగారని, అప్పట్లో ఆయన స్వయంగా నాటిన మొక్కే నేడు వృక్షంగా తయారైందని తెలిపారు. గురువారం గాంధీ జయంతి కావడంతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.