VZM: గజపతినగరంలోని చెత్త నుంచి సంపద కేంద్రం ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను మార్కెట్ కమిటీ అధ్యక్షులు గోపాలరాజు ఆవిష్కరించారు. విశాఖకు చెందిన జీవీ రమణమూర్తి ఈ విగ్రహాలను సమకూర్చారు. ఇందులో గ్రామ సర్పంచ్ కొండమ్మ, ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు, ఈవో జనార్దనరావు పాల్గొన్నారు.