వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ తీవ్రంగా నిరాశపరిచాడు. కరుణ్ నాయర్ స్థానంలో చోటు దక్కించుకున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయినా సుదర్శన్ మెరుగ్గా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.