ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీకి ఇవాళ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అహింస మార్గాన్ని ఎంచుకుని స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆవేశపడి అనర్థాలకు గురవుతున్నారని అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.