AP: రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు తెలిపింది. తీరం వెంబడి 50-70కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు మూడు రోజులపాటు వేటకు వెళ్లొద్దని సూచించింది.