W.G: ఇటీవల తణుకులో సంచలనం రేకెత్తించిన రెండు ఘటనల్లో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన యువకుడు బడుగుల సురేశ్ హత్య కేసును పోలీసులు చేధించారు. తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలు కనకదుర్గను చంపుతామని బెదిరించి 70 కాసుల బంగారం అపహరించిన కేసులో నిందితుడిని మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. ఈ 2 కేసులను విజయదశమి రోజున చేధించారు.