KNR: కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, వెంకటరాం రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన శాంతి, అహింస సిద్ధాంతాలను, దేశానికి చేసిన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.