MDK: మెదక్ ఐడివోసీ కార్యాలయంలో గురువారం ఘనంగా మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ చూపిన అహింసా, శాంతి మార్గం సమాజ సమస్యలు, విభేదాలను అధిగమించడంలో ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.