W.G: నర్సాపురంలో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు కాకిలేటి ఆనంద్ కుమార్ గురువారం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. పట్టణంలో అనేక ప్లెక్సీలు ఉండగా.. తన ఫ్లెక్సీని అక్రమంగా తొలగించారని సెల్ఫీ వీడియోతో ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళితుడు కాబట్టి ఉద్దేశపూర్వకంగా తొలగించారని, టౌన్ సీఐ యాదగిరి కొంతమంది వ్యక్తులతో తొలగించారని ఆరోపించారు.