AP: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతిచెందారు. ఉరవకొండకు చెందిన సుంకన్న, భార్య కల్పన, కుమార్తె భవాని, కుమారుడు సన్నీతో కలిసి బైక్పై కడమలకుంటలోని సుంకులమ్మ ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సుంకన్న, సన్నీ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కల్పన, భవానీని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.