NTR: జగ్గయ్యపేట పట్టణం వైసీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 156వ జయంతి,మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 121వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాల వేసిన ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీజీ ఆవలంభించిన అహింసా మార్గం ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు.