మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.