WGL: జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన్న రమేష్, ఆధ్వర్యంలో స్థానిక నేతలు అందరూ కలిసి మండల పార్టీ కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. సత్యం, అహింస మార్గాలుగా గాంధీ చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని వారు కొనియాడారు.