ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని గురువారం ఆసిఫాబాద్ జైన్ సమాజ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 3,4 న జరగబోయే నూతన జైన్ సమాజ్ ఆలయ (గుడి) ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు వినోద్ తాటియా, ప్రవీణ్ లోధా, సురేష్ లోధా, నరేంద్ర లోధా, దిలీప్ పాల్గొన్నారు.