మహబూబాబాద్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.