BDK: మణుగూరు రాజుపేట కాలనీలో మహాత్మా గాంధీ విగ్రహానికి గురువారం వారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నివాళి అర్పించారు. ఆ మహనీయుడు దేశానికి అందించిన మహోన్నత సేవలను, వారి స్ఫూర్తిని కీర్తిని ఎంత కొనియాడిన తక్కువేనని ఎమ్మెల్యే పాయం తెలిపారు. మనందరం సత్యమార్గంలో నడిస్తేనే జాతిపితకు ఇచ్చే గౌరవం అన్నారు.