MDK: మనోహరాబాద్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా సేవా పక్వాడ్ జిల్లా కన్వీనర్ నత్తి మల్లేష్ ముదిరాజ్, సేవా పక్వాడ్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, నరేందర్ చారి, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.