టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడి పేరును వెల్లడించారు. దసరా సందర్భంగా తమ బిడ్డకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’ అని నామకరణం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 2023 నవంబర్ 1న ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట గత నెల 10న బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.