W.G: భీమవరం టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను 13 మందికి గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే కుటుంబం మొత్తం కలత చెంది ఆందోళనతో ఉంటారని అటువంటి వారికి భరోసాగా ప్రభుత్వం సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక చేయూత అందిస్తున్నారన్నారు.