మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఇవాళ పరిశీలించారు. పట్టణంలోని షాప్ నెంబర్ 9, బోయపల్లి గేటులో షాప్ నెంబర్ 33, షాప్ నెంబర్ 40లను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి బియ్యం సరఫరాను సక్రమంగా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎటువంటి అవకతవకలకు లేకుండా చూడాలని ఆయన సూచించారు.