SKLM: రణస్థలం మండల పరిధిలోని జాతీయ రహదారి 16పై గురువారం భారీ చెట్టు నేల కూలింది. ఉదయం నుంచి గాలులతో కూడిన వర్షం కురవడంతో ఈ చెట్టు నేలకొరిగిందని స్థానికులు అంటున్నారు. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడడంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.